సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి మండలం చిన్నాయిగూడెం వద్ద గత మంగళవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జీడిగింజల లోడుతో ఓ డీసీఎం లారీ టీ నరసాపురం మండలం బొర్రంపాలెం నుంచి నిడదవోలు మండలం తాడిమల్ల వెళుతోంది. ఈ క్రమంలోనే లారీ చిన్నాయిగూడెం వద్దకు రాగానే డీసీఎం వాహనం అదుపు తప్పి పంట కాలువలో బోల్తా పడింది. దానితో లారీలో ప్రయాణిస్తున్న 10 మందిలో జీడీ పిక్కలు బస్తాలు మీద పది ఈ ప్రమాదంలో ఏకంగా ఏడుగురు మృత్యువాతపడ్డారు. ఒక వ్యక్తికి తీవ్రమైన గాయాలు అయ్యాయి. గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేబిన్‌లో ఉన్న వారు అందరూ సురక్షితంగా ఉన్నారు. నేడు, బుధవారం ఉదయం.. దేవరపల్లి రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. లారీ బోల్తా కొట్టడంతో ప్రమాదంలో ఏడుగురు మృతి చెందడంపై ఆవేదన వ్యక్తం చేశారు. గాయపడిన వారికి అందుతున్న వైద్యంపై సీఎం ఆరా తీశారు.బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని చంద్రబాబు అన్నారు.
