సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్:ఏపీ లో బిఆర్ఎస్ పార్టీని విస్తరించాలనే కాంక్షతో తెలంగాణ మంత్రులు ఏపీలో జగన్ పాలనపై చేస్తున్న విమర్శల కు ఇక్కడ వైసిపి మంత్రుల కౌంటర్లు నేపథ్యంలో గతంలో సమైక్య ఆంధ్ర ప్రదేశ్ రోజులు గుర్తుకు వస్తున్నాయి. కాకపోతే ఈ సారి తెలుగు రాష్ట్రాలలో అధికారంలో ఉన్న పార్టీల మంత్రుల మధ్య విమర్శల పర్వము కొనసాగుతుంది. ఈ క్రమంలోనే మంత్రి హరీశ్‌రావు ఏకంగా ఏపీకి చెందిన కార్మికులు అక్కడ ఓటు హక్కును రద్దు చేసుకుని తెలంగాణలో పొందాలని పిలుపునివ్వడం, తెలంగాణ అభివృద్ధి తో పోలిస్తే ఏపీలో అభివృద్ధి ఏ పాటో ప్రజలకు తెలుసునని చేసిన తీవ్ర వ్యాఖ్యలు చర్చనీయాంశమైంది. నిన్న , నేడు, బుధవారం తెలంగాణ మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యలకు ఏపీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు స్పందించారు. ‘‘మీ దగ్గర ఏముందో చెప్పండి హరీశ్‌రావు. రాజధాని హైదరాబాద్ లోనే చిన్న వర్షం పడితే చాలు రోడ్డులు , ఇళ్ళు మొత్తం మునిగిపోయే అభివృద్ధి తెలంగాణాలో హైదరాబాద్ తప్ప ఏ ప్రాంతం అభివృద్ధి చెందింది?మీ తెలంగాణా రోడ్లతో పోలిస్తే ఏపీకి వచ్చి మా కొత్త రోడ్డులు చుడండి.. రాష్ట్ర విభజన లో ధనిక రాష్ట్రము మీకు అప్పగిస్తే అప్పుల పాలు చేసారు.. ముందుగా మీ ప్రతిపక్షాల ఆరోపణలకు సమాధానం చెప్పండి. మీకు ధనిక రాష్ట్రాన్ని అప్పగిస్తే ఏం చేశారు?.’ అని కారుమూరి నాగేశ్వరరావు ప్రశ్నించారు
