సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఎంతో పుణ్యం, చేసుకొంటే దేవాలయం లో ఉద్యోగం వచ్చింది నిజాయితీగా పనిచేయాలి అని భావించడం మాని, కొలువు ఇచ్చిన దేవునికే శఠగోపురం పెట్టె కొందరు ఉద్యోగులు ఫై భక్తులు, హిందూ ధార్మిక సంస్థలు ఒక కన్ను వెయ్యవల్సిన పరిస్థితి ఉంది. తాజగా ఇదే కారణంతో నేడు, గురువారం ..పశ్చిమ గోదావరి జిల్లాలో చిన్న తిరుమల గా ప్రసిద్ధి పొందిన ద్వారకాతిరుమల దేవస్థానం లో రికార్డ్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న చిలుకూరి పవన్‌ను సస్పెండ్ చేసి పోలీసులు అరెస్ట్ చేశారు. భీమడోలు కోర్టు లో పవన్‌ను హాజరుపరిచారు. పవన్‌కు న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్ ధించారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో చిన్న వెంకన్న స్వామి వారిని రోజు వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు. భక్తుల రద్దీని ఆసరాగా తీసుకొని ఆలయ ఉద్యోగి చిలుకూరి పవన్ శీఘ్ర దర్శనానికి సంబంధించిన రూ.200 రూపాయల టికెట్లను ఒకే సీరియల్ నెంబర్‌తో తానే స్వంతంగా ప్రింట్ చేయించి రీసెల్ టికెట్స్ అమ్మకాలు చేస్తుండగా.. పిర్యాదు రావడంతో ఆలయ సూపరింటెండెంట్ సుబ్రహ్మణ్యం రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని ఆలయ ఈవో త్రినాధరావుకు అప్పగించారు అని సమాచారం,. తక్షణమే స్పందించిన ఇఓ చర్యల మేరకు.. పవన్‌ను సస్పెండ్ చేశారు. తదుపరి పోలీసులు అరెస్ట్ చేసారు. దీనివెనుక ఇంకా ఎవరి ప్రమేయం ఉందేమో? ఇప్పటికి ఎంత టికెట్స్ ఆదాయం జేబులలో వేసుకొన్నారో? ఇదిలా ఉండగా.. గత బుధవారం ద్వారకా తిరుమలలోనే .. విజయవాడ, దుర్గా మల్లేశ్వరస్వామి దేవాలయంలో సూపరింటెండెంట్‌గా పని చేస్తున్న వాసా నగేష్‌కు చెందిన అపార్టుమెంట్‌పై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులను సమ కూర్చుకున్నారన్న ఆరోపణలపై కొన్ని ముఖ్యమైన రికార్డులను స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. నగేష్ గతంలో స్థానిక చిన్న వెంకన్న శ్రీవారి దేవస్థానంలో వివిధ హోదాల్లో పనిచెయ్యడం గమనార్హం,
