సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఎంతో పుణ్యం చేసుకొంటే దేవుని కొలువు దొరుకుతుంది అంటారు. మరి దేవునికే ఆదాయానికి,ఆస్తులకు భూములకు ఎన్నో రకాల శఠగోపురం పెట్టిన కొందరు ఇంటిదొంగల ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉంటాయి. తెలిసేది గోరంత.. తెలియంది కొండంత.. అయితే దొరికితేనే దొంగ .. దొరకని దొంగలు ఎందరో..? తాజగా.. దేశవ్యాప్తంగా చిన తిరుమలగా ప్రసిద్ధి చెందిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో అత్యధిక ఆదాయం వచ్చే ద్వారక తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయం, కల్యాణమండపంలో జరిగే శ్రీవారి నిత్య కల్యాణంలో స్వామి, అమ్మ వార్లకు భక్తులు చదివింపులుగా సమర్పించిన కానుకలను తగ్గించి రాసినట్లు అడిట్ అధికారులు గుర్తించడంతో, దీనికి బాధ్యులైన రికార్డు అసిస్టెంట్, కె.హరిశ్చంద్ర ప్రసాద్, తోపాటు ఏఈవోలు నటరాజారావు, మెట్టపల్లి దుర్గారావు, సూపరింటెండెంట్ సుబ్రహ్మణ్యం లకు సంజాయిషీ నోటీసులు జారీ చేసినట్లు ఈవో వేండ్ర త్రినాథరావు ప్రకటించారు.2023-24 ఆర్థిక సంవత్సరంలో సుమారు రూ.98 వేలు విలువైన కానుకలు స్వాహా చేసినట్లు విచారణలో తేలడంతో ఈ మేరకు చర్యలు తీసుకోనట్లు ప్రకటించారు.
