సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు శత జయంతిని పురస్కరించుకుని మెగాస్టార్ చిరంజీవికి ప్రతిష్ఠాత్మక ‘ఏఎన్ఆర్ అవార్డు’ (ANR National Award 2024)ను అక్కినేని నాగార్జున ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అవార్డు ప్రధానోత్సవ వేడుక నేటి సోమవారం రాత్రి వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ముఖ్య అతిథిగా హజరై చిరంజీవికి అవార్డు ప్రధానం చేశారు. హీరోలు విక్టరీ వెంకటేష్ , రామ్ చరణ్, నాని,, సిద్దు జొన్నలగడ్డ, సుధీర్ బాబుతో సహా టాలీవుడ్ తారాలోకమంతా ఈ వేడుకకు తరలివచ్చారు.ఈ కార్యక్రమంలో భాగంగా కీరవాణి సారధ్వంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం అక్కినేని నాగేశ్వర రావు చివరగా మట్లాడిన మాటలను, అంతొమ యాత్రలను అక్కడ తెరపై ప్రదర్శించగా అక్కడికి వచ్చిన అతిథులందరి చేత కంటతడి పెట్టించాయి. ఆపై నాగార్జున, అమితాబ్, చిరంజీవి మట్లాడుతూ అక్కినేని సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి తల్లి అంజనాదేవి, అల్లు అరవింద్, ప్రకాష్ రాజ్ రమ్యకృష్ణ, రాజేంద్ర ప్రసాద్, దర్శకుడు కె. రాఘవేంద్రరావు, బోయపాటి శ్రీనివాస్, నాగ్ ఆశ్విన్, విజయేంద్ర ప్రసాద్, శోభిత దూళిపాళ్ల, మురళీమోహన్, కె.ఎస్ రామారావు, బ్రహ్మానందం, అశ్వినీదత్, ఆది శేషగిరి రావు, సుబ్బరామిరెడ్డి, నందమూరి రామకృష్ణ, వైవిఎస్ చౌదరి, అక్కినేని కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
