సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్:తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలో జగన్ సర్కార్ కు వ్యతిరేకంగా చేస్తున్న వ్యాఖ్యలు ఫై ఏపీ సినీ కార్పొరేషన్ చైర్మెన్ పోసాని కృష్ణ మురళి మీడియాతో మాట్లాడుతూ..వైఎ‍స్సా ర్ చేసిన మంచి పనులతో ప్రజల్లోచెరగని ముద్ర వేసుకున్నారు. ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తండ్రి కంటే గొప్ప గా పరిపాలిస్తున్నారు. గతంలో ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచిన టీడీపీ అధినేత చంద్రబాబు, తన దుష్ట చతుష్టయంతో కలసి ఇప్పుడు సీఎం జగన్ ఫై కూడా అసత్య ప్రచారాలు చేస్తున్నారు. కానీ, సీఎం జగన్ వీళ్లెవ్వ రికీ భయపడేవారు కాదు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ అమలు చేస్తున్నారు. అందుకే ప్రజలు మద్దతు సీఎం జగన్ కే ఉంది. అన్ని రకాల యాసిడ్ టెస్టులను కూడా జయించిన నాయకుడు సీఎం వైఎస్ జగన్. ఇటీవల పవన్ వ్యాఖ్యలు చూస్తుంటే .. గోదావరి జిల్లాలలో కాపులు ఎక్కువ ఉండే 34 సీట్లు గెలుచుకొని చంద్రబాబు ని సీఎం చెయ్యాలని బాగా తపన పడుతున్నారు. దీనిని కాపులు హర్షిస్తారా ? చంద్రబాబు సీఎం అయితే హెరిటేజ్ సంపద పెరుగుతుంది..రాష్ట్ర సంపద కాదు. చంద్రబాబుకు ఓటేస్తే రాష్ట్ర ప్రజలుభవిష్యత్ని నాశనం చేసుకున్నట్టే. చంద్రబాబు ఏ ఒక్క హామీనైనా గతంలో నెరవేర్చా డా?. రైతులను, మహిళలను, యువతని ముంచేసిన వ్య క్తి చంద్రబాబు. నిజానికి సీఎం జగన్ను ఓడించేంత బలం జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి లేదు. జగన్ను ఓడించేంత సత్తా పవన్కు ఉంటే తన అన్న చిరంజీవిని ఎందుకు సీఎం చేయలేకపోయాడు. కాపులను పవన్ కళ్యాణ్ మోసం చేసి, వారికి నష్టం చేస్తున్నా డు. ముద్రగద కాపుల కోసం పదవులు కోల్పోయిన వ్య క్తి. అలాం టి ముద్రగడను పవన్ తిట్టించడం దారుణం అంటూ వ్యాక్యలు చేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *