సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగు సినీ హీరోలలో 90 శాతం విజయాలు సాధించిన హీరోలలో వెంకటేష్ నెంబర్ 1 ఇప్పటికి విజయాలలో ముందుండే విక్టరీ వెంకటేష్ తన కుటుంబ విషయాలు మాత్రం ఎప్పుడు గోప్యంగా ఉంచుతారు. ఇప్పటికే మొదటి కుమార్తె ఆశ్రిత వివాహం కూడా మీడియా వాళ్ళకి దూరంగా జరిపించారు. ఇప్పుడు రెండవ కుమార్తె హవ్య వాహిని నిశ్చితార్ధం తాజాగా విజయవాడలో జరిగింది, ఇది కూడా మీడియా వాళ్ళకి తెలియనివ్వలేదు. సినీ పరిశ్రమలో మహేష్ బాబు, చిరంజీవి వంటి కొద్దీ మంది ఆత్మీయులను మాత్రమే విజయవాడలో జరిగిన పంక్షన్ కు ఆయన ఆహ్వానించారు. అయితే తాజాగా సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు, ఫోటోస్ చూసి ఎవరెవరు హాజరయ్యారో తెలిసింది, పెళ్లి మాత్రం డిసెంబర్ లో శ్రీ లంకలో జరుగుతుందని భావిస్తున్నారు. పెద్దోడు ఇంట్లో శుభకార్యక్రమానికి చిన్నోడు మహేష్ బాబు కుటుంబ సభ్యుడు లాగా బాగా సందడి చేసాడని తెలుస్తుంది. మరోసారి ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ కు సీక్వల్ కు దిల్ రాజు రంగం సిద్ధం చేస్తున్నారు మరి..అలాగే రానా దగ్గుబాటి , నాగ చైతన్య కూడా వీళ్ళతో పాటు వున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *