సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: వైసీపీ కీలక అగ్ర నేత, విజయసాయి రెడ్డి ఇటీవల తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి కూటమికి రాజ్యసభలో మరో సీటు కు ద్వారాలు తెరచి మేలు చేసిన విషయం అందరికి విదితమే. అయితే కూటమి లోని తెలుగుదేశం పార్టీ కన్నా ఆ ఎంపీ సీటు దాదాపుగా బీజేపీ కి కానీ జనసేన కు కానీ కేటాయించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. గతంలో వైసీపీ రాజ్య సభ సభ్యులు ముగ్గురు రాజీనామా చేసినప్పుడు వాటిలో 2 టీడీపీ, ఒకటి బీజేపీ తరపున కేటాయింపు జరిగింది. మరి జనసేన కు ఈసారి తప్పని సరిగా కూటమి ధర్మం గా కేటాయించాలి. మరి ఆ స్థానంలో నాగబాబు వస్తారని భావిస్తున్నారు. ఇటీవల ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేస్తామని టీడీపీ హామీ ఇచ్చిన ఇప్పటివరకు అమలు కాలేదు. అనుకోకుండా విజయ సాయి రెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన ఆ స్తానం నాగబాబు కు వస్తే కేంద్ర మంత్రి కూడా కావచ్చు.. అయితే మరో సంచలన సమాచారం ఏమిటంటే బీజేపీ తరపున మెగాస్టార్ చిరంజీవిని కేంద్ర మంత్రిని చేసే ఉద్దేశ్యంతోనే బీజేపీ పెద్దలు ఉన్నట్లు తాజా పరిణామాలు కనపడుతున్నాయి. మరో ట్విస్ట్ ఏమిటంటే బీజేపీ పెద్దల కోరికమీద వైసీపీలో ఉన్నత విద్య వంతుడు , మేధావి విజయసాయి రెడ్డి రాజ్యసభ సిటు ఖాళీ చేసారని ..రాజకీయాలకు దూరంగా..ఆయనకు జీవితాశయం ఆర్బీఐ గవర్నర్ లేదా ఏదయినా రాష్ట్రానికి గవర్నర్ గ పంపే యోచనలో బీజేపీ అధిష్టానం ఉన్నట్లు కూడా వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. మరో నెల రోజులలో ఈ సస్పెన్సు లు అన్ని తొలగిపోతాయి. మొత్తానికి ఏపీలో పార్టీలు ఏవైనా నేతలు ఎవరైనా ఢిల్లీ బీజేపీ దర్శకత్వంలోనే..
