సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, శుక్రవారం విశాఖపట్నంలో ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ మీడియా సమావేశంలో నారా చంద్రబాబు, చిరంజీవి, పవన్ కల్యాణ్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. 2014 లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు అసమర్ధత వల్లే ఆయన కేంద్రం నుండి ప్రత్యేక హోదా బదులు ప్యాకేజి తీసుకోవడం వల్లే ఏపీ ప్రజలు, పారిశ్రామిక వేత్తలు హోదా రాయితీలు కోల్పోయారని, ప్రజలకు రైతులకు రుణమాఫీ హామీలు ఎగవేసి ఇప్పడు మరల అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని ఉద్ధరిస్తామని హామీలు ఇస్తున్నారని, అప్పుడు ఎందుకు చంద్రబాబు చేసిన అవినీతి, అప్పులను మద్దతు ఇచ్చిన పవన్ ఎందుకు ప్రశించలేదని అన్నారు. ఇప్పటికి పవన్ చంద్రబాబు ను అధికారంలోకి తేవడమే పరమావధిగా పొత్తు పెట్టుకొని పని చేస్తున్నాడని.. జనసైనికులకు, జోగయ్యకు అర్ధం అయిపొయింది. మొన్న మరల విశాఖలో చంద్రబాబు తో వేదిక పంచుకొన్నాడని .. అక్కడ పవన్ మాటలు పిచ్చి వాడి మాటల్లా ఉన్నాయి. తాజగా హరిరామ జోగయ్య లేఖను పవన్ చదివాడా? 27 శాతం ఉన్న కాపులు ఎందుకు ముఖ్యమంత్రి కాలేదు. మన కాపులలో చిరంజీవి, పవన్ లాంటి ప్యాకేజీ స్టార్స్ ఉండటం వల్లే కాపులు సీఎం కాలేదు. ఇప్పుడు వీళ్ళకి నచ్చలేదని సీఎం జగన్ ను దించి చంద్రబాబుని ముఖ్యమంత్రి చేస్తే ఇప్పుడున్న అప్పులు ఆయన తీర్చగలడా..? అని కేఏ పాల్ తనదయిన శైలి లో ప్రశ్నల వర్షం కురిపించారు.
.
