సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: సీనియర్ హీరో మెగా స్టార్ చిరంజీవిలో అతనికి మాత్రమే సొంతం అయినా ఏ రాజకీయ నేతలో లేని విలక్షణ లక్షణాలు ఉన్నాయి, అని మరోసారి నిరూపించుకొన్నారు. ఆయన గతంలో ప్రజా రాజ్యం పార్టీ పెట్టి తరువాత కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి ఏపీ రాష్ట్ర విభజన సమయంలో కేంద్ర మంత్రిగా రాజ్య సభ సభ్యునిగా కొనసాగిన విషయం అందరికి తెలిసిందే.. తరువాత జనసేన ను పరోక్షంగా ప్రోత్సహిస్తున్న ప్పటికీ కాస్త రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అయితే ఇప్పటికి అయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చెయ్యకపోవడం వాళ్ళ కాంగ్రెస్ సభ్యత్వం రెన్యూవల్ అవుతూనే ఉంది . తెలంగాణాలో సీఎం రేవంత్ రెడ్డి తో అదే సాన్నిహిత్యం ఉంది. మరో ప్రక్క తమ్ముడు జనసేన తో అఖండ విజయం సాధించి ఏపీలో ఉప ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. ఇంకో ప్రక్క కేంద్రం లోని ప్రధాని మోడీ తో గత 3 ఏళ్లుగా చిరంజీవి కి పెరిగిన సాన్నిహిత్యం దృష్ట్యా బీజేపీ లో చేరతారని త్వరలో కేంద్రంలో కీలక పదవి అధిష్టిస్తారని ఒక ప్రక్క తీవ్ర ప్రచారం జరుగుతున్నా నేపథ్యంలో .. తాజగా గత ఆదివారం రాత్రి యువహీరో విశ్వక్ సేన్ సినిమా లైలా ప్రీ రిలీజ్ పంక్షన్ లో పాల్గొన్న మెగాస్టార్ చిరంజీవి నోట ఎవరు ఊహించని విధంగా.. జై జనసేన మాట వినిపించింది. నాడు నేను స్థాపించిన ప్రజారాజ్యం నేటి జనసేనగా మారిందన్నారు చిరంజీవి. ఇందుకు తాను సంతోషంగా ఉన్నానని ప్రకటించారు. అంతటితో ఆగలేదు.. జై జనసేన అంటూ నినాదాలు చెయ్యడం తో అందరు విస్తుపోయారు. త్వరలో జనసేన పార్టీ మరింత బలోపేతం చేసే దిశగా కేంద్రంలోకి మెగా స్టార్ వెళ్లనున్నారా ? మరోసారి రాజకీయాలలో చిరంజీవి బిజీ కానున్నారా? ఏదయినా కాలం కల్సి వచ్చే వరకు ఎవరిని నొప్పించక.. చిరంజీవికి మాత్రమే ఉన్న ఉన్న ఓర్పు.. సహనం…
