సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్; సంక్రాంతి కి వస్తున్నాం సినిమాతో తెలుగులో డైరెక్ట్ గా 300 కోట్ల పైగా కలెక్షన్స్ సాధించిన తొలిహీరోగా విక్టరీ వెంకటేశ్ సంచలన రికార్డ్స్ నమోదు చేస్తే.. తదుపరి ఆయన సుమారు 40 నిముషాలు ఉండే కీలక పాత్రలో మెగాస్టార్ చిరంజీవి ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమాలో ‘మల్టీస్టార్’ గా వెంకటేశ్ గత నెల రోజులుగా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ నెలాఖరులోగా ఈ సినిమా టాకీ పార్ట్ పూర్తవుతుంది. డిసెంబర్ మొదటి వారంలో చిరంజీవి , వెంకటేశ్ పై ఓ స్పెషల్ సాంగ్ చిత్రీకరణ జరగనుంది. అనంతరం వెంకటేశ్ నేరుగా త్రివిక్రమ్ సినిమా సెట్‌పైకి వెళ్లిపోతాడని తెలుస్తోంది. ఇప్పటికే షూటింగ్ ప్రారంభమైన ఈసినిమా డిసెంబర్ 15 నుంచి ప్రాజెక్ట్ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవుతుందని చెబుతున్నారు. ఇందులో ‘కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా ఒక నటిస్తుంది. నాన్‌స్టాప్ షూటింగ్ జరుపుకుంటూ, వచ్చే మార్చి కల్లా షూటింగ్ పూర్తీ చేసుకొని 2026 మేలో సమ్మర్ కు గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఈ చిత్రానికి మ్యూజిక్ సంచలనం హర్షవర్ధన్ రామేశ్వర్ అందిస్తున్నారు. మరో నువ్వు నాకు నచ్చవు సినిమా రిపీట్ ఖాయం అని ఇండస్ట్రీ భావిస్తుంది, ఈ ప్రాజెక్ట్‌ను త్వరగా పూర్తి చేసి, వెంకటేశ్ తర్వాత ‘దృశ్యం 3’లోకి వెళ్లాలని ఫిక్స్ అయ్యారు.
