సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: వరుస సూపర్ డూపర్ హిట్ సినిమాల దర్శకుడు అనిల్‌ రావిపూడి. చిరంజీవి, నయనతార జంటగా అనిల్‌ దర్శకత్వం వహిస్తున్న‘మన శంకరవరప్రసాద్‌గారు’ చిత్రం ఈ సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదల కానుంది. ఇందులో సుమారు 30 నిమిషాల పాటు విక్టరీ వెంకటేశ్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే ఇప్పుడు మరో సర్‌ప్రైజ్‌ ఇచ్చారు దర్శకుడు. చిరు, వెంకీ ఇద్దరూ ఈ సినిమాలో ఒకరి సూపర్ హిట్ సినిమా పాటలకు మరొకరు కాలు కదిపారట. ఇద్దరు కలసి వేసె ఉర్రూతలూగించే ఆ పాట అని మరో వారంలో రిలీజ్‌ చేస్తామని డైరెక్టర్‌ అనిల్‌ ప్రకటించారు. మంచి కామిడి టైమింగ్ తెలిసిన ఇద్దరు అగ్రహీరోలు ను ఇద్దరినీ కలిపి తెరపై చూడబోతుండటం థియేటర్లు దద్దరిల్లడం ఖాయమని చెబుతున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ‘మీసాల పిల్ల’, ‘శశిరేఖ’ పాటలు ఎంతగా ఆకట్టుకున్నాయో తెలిసిందే!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *