సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: నేడు, బుధవారం పల్నా డు జిల్లా చిలకలూరిపేటలో పర్యటిస్తున్న చం ద్రబాబుకు ఊహించని రీతిలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల నుంచి నిరసన సెగ తగిలింది. చంద్రబాబు పర్యటన జరుగుతుండగా ఆయనకు కనపడేలా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు జూనియర్ ఎన్టీఆర్ ఫోటోలు ఉన్న జెండాలు ప్రదర్శిస్తూ .. అమరావతి రైతుల పాదయాత్రలోనూ మా నాయకుడిని ఎందుకు విమర్శిస్తున్నారని, సమాధానం చెప్పాలని ప్రశ్నిస్తూ నినాదాలతో హోరెత్తించారు. దానితో ఒక్కసారి ఎన్టీఆర్ అభిమానుల నిరసన వ్యవహారం చూసి చం ద్రబాబు ఒక్క సారిగా బిత్తర పోయిన చంద్రబాబు అసంతృప్తికి లోనుకావడంతో వెంటనే సీనియర్ నేతలు, టీడీపీ కార్య కర్తలు రంగంలోకి దిగి జూనియర్ ఎన్టీఆర్ అభిమానులను సముదాయించి ఇది సమయం కాదని అక్కడ నుండి పంపించడంతో వారు “జై జూనియర్ ఎన్టీఆర్” అంటూ నినాదాలు చేసుకొంటూ కడలి వెళ్లారు అని వార్త సమాచారం.
