సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: 61 వ వార్షికోత్సవాలు చివరి అంకంలోకి ప్రవేశించిన నేపథ్యంలో భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారు నేడు, సోమవారం శ్రీ సంతాన లక్ష్మి దేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ అలంకారం కు స్థానిక భక్తులు నంబుల పరమేశ్వర రావు దంపతులు నేతృత్వం వహించారని ఆలయ సహాయ్ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ తెలిపారు. తన భక్తుల సంతానం కు అభయం ప్రసాదిస్తూ వారికీ పూర్ణ కుంభంతో మంచి భవిషత్తు ప్రసాదించే సంతాన లక్ష్మి గా 8 చేతులతో నిలువెత్తు విరాట్ స్వరూపంలో శ్రీ అమ్మవారి దర్శనం ఇస్తున్నారు. ఈనెల 14వ తేదీన శ్రీ అమ్మవారు శ్రీ అన్నపూర్ణ దేవి దర్శనం తో వేలాది భక్తులకు అన్నసమారాధన తో ఈ ఏడాది వార్షికోత్సవాలు ముగియనున్నాయి.
