సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారి జేష్ఠమాస జాతర మహోత్సవాలు చివరి అంకంలోకి చేరుకొన్నాయి. నేడు బుధవారం శ్రీ అమ్మవారికి నీవైద్యాలు చెల్లించి రాత్రి సేవ దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. రేపు ఉదయం ఉదయం 5న్నర గంటల నుండి ప్రత్యేక పూజలు ఉయ్యాల సేవ అనంతరం గరగల రూపంలో ఉన్న శ్రీ అమ్మవారిని ఆలయంలో ప్రవేశపెట్టడంతో జేష్ఠమాస జాతర ముగుస్తుంది. నేడు, శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారిని దర్శించుకున్న ఉప్పులూరు కి చెందిన యర్రా సాయి మేఘనాధ్ పేరుమీద వారి కుటుంబసభ్యులు 8 గ్రాముల బంగారం అమ్మవారికి కానుకగా అందించారని , వారికీ అమ్మవారి ప్రసాదం , శేష వస్త్రం, ఫొటో అందించామని ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *