సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం గునుపూడి లో వేంచేసి యున్న పంచా రామక్షేత్రం శ్రీ సోమేశ్వర జనార్థన స్వామి వార్ల దేవస్థానం నందు కార్తీక మాసోత్సవములు చివరి అంకంలో ప్రవేశించాయి. సందర్భముగా నేడు, బుధవారం 26వ రోజు భక్తుల కానుకలు వలన రూ.305/- సేవల వలన రూ.2,850/– , దర్శనం టిక్కెట్ల వలన రూ.21,000/-లు, లడ్డుల వలన రూ.5,460/-లు, అన్నదానం ట్రస్టు నిమిత్తం రూ.43,812/-లు, మొత్తం రూ.73,427/-లు వచ్చి యున్నది. ఈరోజు అన్నదానం ట్రస్టు ద్వారా 3,000 మందికి అన్నప్రసాదం వితరణ జరుపటమైనది. గత మంగళవారం అయితే రూ.1,08,370/-లు వచ్చి యున్నది. ఈరోజు అన్నదానం ట్రస్టు ద్వారా 5,000 మందికి అన్నప్రసాదం వితరణ దాతలు స్థానికుల సహకారంతో జరిపామని కార్యనిర్వహణాధికారి డీ రామకృష్ణంరాజు తెలిపారు.
