సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: భీమవరంలో గత మే నెల 21వ తేదీన ప్రారంభమైన శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారి జేష్ఠమాస జాతర మహోత్సవాలు చివరి అంకంలోకి ప్రవేశించాయి. దీనిలో భాగంగా రేపు బుధవారం దేవాలయం లో శ్రీ అమ్మవారికి నైవేద్యాలు, చలిమారులు మరియు రాత్రి సేవ నిర్వహిస్తారు, ఎల్లుండి గురువారం ఉదయం 5న్నర గంటలకు శ్రీ మావుళ్ళమ్మవారి ఉత్సవ విగ్రహానికి , శ్రీ అమ్మవారి ప్రతిరూపంగా భావించే గరగలకు ఉయ్యాలా సేవ నిర్వహించి తదుపరి శ్రీ అమ్మవారి గర్భాలయం లో అర్చకుల మంత్రోచ్చారణల మధ్య తిరిగి ప్రవేశపెడతారు.
