సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారి 60 వ వార్షికోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో చివరి అంకంలోకి ప్రవేశించాయి.నీరుల్లి కూరగాయ పండ్ల వర్తక సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ వేడుకలలో భారీ సెట్స్ లైటింగ్ అలంకరణలు, వేదికపై నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు, మ్యూజికల్ నైట్స్ , నాటకాలు కు నేటి మంగళవారం కార్యక్రమాలు తో ముగింపు పలకనున్నారు. ఆఖరి రోజులు కావడంతో భక్తులు పోటెత్తిపోతున్నారు.ఇక నేటి మంగళవారం సాయంత్రం 5గంటలకు కూచిపూడి జానపద నృత్యాలు తో పాటూ రాత్రి 8గంటలకు ‘గయోపాఖ్యానం’ నాటికం ప్రదర్శనం జరుగుతుంది. ఇక రేపు ఎల్లుండి కార్యక్రమాలకు విశ్రాంతి. ఇక 9వ తేదీ ఉదయం 8 గంటల నుండి శ్రీ అమ్మవారికి మహా కుంభ నైవేద్యం అనంతరం భక్తులకు భారీ అన్నసమారాధన నిర్వహిస్తారు. సుమారు లక్ష మంది భక్తుల కోసం సాయంత్రం వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఆ రోజు శుక్రవారం ఆలయంలో దేవాదాయ శాఖ , ధర్మకర్తల మండలి ఆధ్వర్యంలో భక్తులు పాల్గొనే చండి యాగం’ ను నిలిపి వేశామని భక్తులు సహకరించాలని ఆలయ సహాయ కమిషనర్ యం భద్రాజీ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *