సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పవిత్ర కార్తీక మాసం నేటి మంగళవారంతో చివరి అంకం చేరుకొంది. పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం, పాలకొల్లు లోని పంచా రామాలలో భక్తులు విశేషంగా దర్శనాలు చేసుకొంటూ దీపారాధనలు చేస్తున్నారు. ఇక భీమవరం గునుపూడి లో పవిత్ర పంచారామ క్షేత్రం శ్రీ సోమేశ్వర జనార్థనస్వామి వార్ల దేవస్థానం నందు కార్తీకమాసం నిన్న సోమవారం 27 రోజన వివిధ దర్శనాల టికెట్స్, పూజ,స్వామివారి సేవల టికెట్స్ అమ్మకాలతో పాటు విరాళములు రూ.12,743/-లు కలపి , 3108 లడ్డులు విక్రయించుట వలన వచ్చిన రూ.46,620/-ఆదాయం కలపి మొత్తం 6 లక్షల 70వేల 613/-రూపాయలు ఆధాయం వచ్చిందని, దాతల సహకారంతో మహా అన్న ప్రసాద వితరణలో వేలాదిగా భక్తులు పాల్గొన్నారని కార్యనిర్వహణాధికారి, డి రామకృష్ణంరాజు తెలిపారు. భక్తులకు తగు ఏర్పాట్లను ఆలయం ధర్మకర్తల మండలి సభ్యులు కూర్మదాసు సత్య శ్రీనివాస్,నాచు శ్రీవల్లి, లక్కు త్రిమూర్తులు, కోయ తాతాజీ, నల్లం రఘు బాబు, చల్లబోయిన సూర్యప్రకాష్, సోమాదుల లీలాఈశ్వరి, తాణాల రామకృష్ణ పర్యవేక్షించారు. కార్తీకమాస ఉత్సవాలు ముగింపు కావడంతో రేపు బుధవారం దేవస్థానం నందు ఉదయం గం.9.00ల నుండి గ్రామస్థులు భక్తులు ధర్మకర్తల మండలి సభ్యులు మరియు దేవదాయ శాఖ అధికారుల సమక్షములో హుండీలు తెరచి భక్తులు సమర్పించిన కానుకలు లెక్కించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *