సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారి 60వ వార్షిక ఉత్సవాలు ఈ సరి 4వారలు ఘనంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో చివరి వారం లోకి చేరుకొన్నాయి. ప్రతిరోజూ వేలాది భక్తులు శ్రీ అమ్మవారిని ఉదయం నుండి రాత్రి వరకు సందర్శించుకొంటున్నారు. నీరుల్లి కూరగాయ పండ్ల వర్తక సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ వేడుకలలో భారీ సెట్స్ లైటింగ్ అలంకరణలు, వేదికపై నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు, మ్యూజికల్ నైట్స్ , నాటకాలు వీక్షించడానికి సాయంత్రం నుండి రాత్రి 10 గంటల వరకు భారీ సందడి వాతావరణం కనపడుతుంది. ఈసారి ఉత్సవాల్లో ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో సినీ నటులకు స్వర్ణ కానుకలతో సన్మానాలు లేకపోవడం.. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో జరిగే ఉత్సవాలలో ఆఖరి 9 రోజులు శ్రీ అమ్మవారికి రోజుకో దేవి అలంకరణ లేకపోవడం కొంత వెలితిగా భావించాలి. అయితే ప్రతి రోజు దేవాలయం ఆవరణలో ఉదయం పూట కూడా మహిళల కోలాటాలు , ఆధ్యాత్మిక కార్యక్రమాలు తో కోలాహలంగా ఉంటుంది.శని ఆదివారాలలో భక్తులు పోటెత్తిపోతున్నారు.ఇక ఈ నెల 6వ తేదీ మంగళవారం తో కళావేదికపై నిర్వహించే నాటక , ఇతర సాంస్కృతిక ప్రదర్శనలు ముగుస్తాయి. 7, 8 తేదీలలో విశ్రాంతి ఇక 9వ తేదీ ఉదయం 8 గంటల నుండి శ్రీ అమ్మవారికి మహా కుంభ నైవేద్యం అనంతరం భక్తులకు భారీ అన్నసమారాధన నిర్వహిస్తారు. సుమారు లక్ష మంది భక్తుల కోసం సాయంత్రం వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *