సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: చాల కాలం తరువాత 2024 ఏడాది చివరి 2నెలలులో ఏకంగా 18 మంచి ముహూర్తాలు రావడంతో శుభకార్యక్రమాల సందడి ఉపందుకోనుంది. పశ్చిమ గోదావరి జిల్లాలో పెళ్లిళ్ల సందడి మొదలైంది. ఒక ప్రక్క పవిత్ర కార్తీక మాసం మరోప్రక్క నవంబరు 12 నుంచి డిసెంబరు 16 వరకు సుమారు 18 ముహూర్తాలు ఉండడంతో తల్లిదండ్రులు తమ పిల్లలకు ఓ ఇంటివారిని చేసే పనిలో పెళ్లి పనులలో హడావిడిగా ఉంటున్నారు. కల్యాణ మండలపాలు పురోహితులకు, జ్యువెలరీ షాపులకు, మంగళ వాయిద్యాల వారికి, వంట మనుషులకు, డెకరేషన్ చేసేవారికి, భజంత్రీల వారికి, ఫొటోగ్రాఫర్లకు, ఎలక్ర్టీషియన్స్‌కు, ఈవెంట్ మేనేజర్స్‌కు, బ్యూటీషియన్స్‌కు, షామియానా, వేదిక అలంకరణ, పూల దండలు, పండ్లు, ఇతరత్రా కేటరింగ్ పని వారికీ మంచి డిమాండ్ ఏర్పడింది.
