సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ లో నేడు, గురువారం చేనేత కళాకారులందరికీ జాతీయ చేనేత దినోత్సవ సందర్భంగా విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ (Minister Lokesh) శుభాకాంక్షలు తెలిపారు. భారతీయ సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక చేనేత అని, మన నేత సోదరులు చేతులు మగ్గాలు ఉపయోగించి నేసిన వస్త్రాలు ప్రపంచవ్యాప్తంగా దశాబ్దాలుగా పేరుగడించాయని సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ (x) వేదికగా మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు. రాష్ట్రంలో వ్యవసాయం తర్వాత వేలాది మందికి ఈ రంగం ఉపాధి కల్పిస్తోందని మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. అలాంటి రంగానికి అండగా నిలిచేందుకు కూటమి ప్రభుత్వం నేటి నుంచి ప్రతి చేనేత కార్మికుడు కుటుంబానికి నెలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందజేస్తోందని ప్రకటించారు. చేనేత వస్త్రాలపై జీఎస్టీ భారాన్ని తమ ప్రభుత్వమే భరించనుందని. దీంతో పాటు త్రిఫ్ట్ ఫండ్ కింద ఏడాదికి రూ.5 కోట్లు విడుదల చేయనుందని ప్రకటించారు.
