సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ మునిసిపల్ అధికారులపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తాజగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వం చేపట్టిన చేపలు, మాంసం దుకాణాల కేటాయింపునకు విజయవాడ మునిసిపల్ అధికారుల ఈ-వేలం విధానాన్ని ప్రశ్నించిన కోర్టు ఈ విధానం వల్ల చిన్న వ్యాపారులకు అన్యాయం జరుగుతుందని పేర్కొంది. అధికారులు ఏసీ గదుల్లో కూర్చుని నిర్ణయాలు తీసుకుంటున్నారా? అసలు క్షేత్రస్థాయి వాస్తవాలు తెలియవా?.. చిరు వ్యాపారుల ఇబ్బందులు పట్టవా? అంటూ తీవ్ర స్థాయిలో ప్రశ్నించింది. ఈ-వేలం నోటిఫికేషన్‌ను నిలిపివేస్తూ తదుపరి విచారణను మార్చి 3కి వాయిదా వేసింది. దీనిపై ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *