సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల కాలంలో తిరుమల లడ్డు నెయ్యి వివాదం విషయం లో అటుతిరిగి ఇటు తిరిగి వివాదం వైసీపీ శ్రేణులు ఎమ్మెల్సీ లు సమర్ధవంతంగా టీడీపీ చాపక్రిందకు చేరిన మాట వాస్తవం. అలాగే ఇటీవల సీఎం చంద్రబాబు బూట్లు తో శ్రీ వెంకటేశ్వర స్వామి ఫొటోలతో, పూజ కార్యక్రమాలలో, శంకుస్తాపనలలో పాల్గొన్న కోకొల్లు దృశ్యాలు వీడియోలు, వై ఎస్ రాజశేఖర్ రెడ్డి తిరుమలను 7 కొండలుగా జిఓ ఇచ్చిన ఘటనలు ఆ జిఓ ను రద్దు చేస్తానని ప్రకటించిన చంద్రబాబు ప్రకటించిన వీడియో ను వైసీపీ సోషల్ మీడియా శ్రేణులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. దీనిపై కొద్దీ రోజులు మోనంగా ఉన్న సీఎం చంద్రబాబు నేడు, శనివారం ఘాటుగా స్వాందించారు. వైసీపీ నేతలు ఎమ్మెల్సీ లు ఏపీ శాసనమండలిలో వేంకటేశ్వర స్వామి ఫొటోలతో చేసిన నిరసనల అంశంపై వినుకొండ సభలో సీఎం మాట్లాడుతూ.. వారు చెప్పులు‌ వేసుకుని‌ వేంకటేశ్వరస్వామి ఫొటోలను సభలో విసిరేశారని మండిపడ్డారు. శ్రీవారి విషయం బయట మాట్లాడకూడదని రెండు రోజులుగా ఆగానన్నారు. గతంలో వేంకటేశ్వరస్వామి స్వయంగా తనను కాపాడారని.. వేంకటేశ్వరస్వామిని అపవిత్రం చేస్తే ఊరుకోనని హెచ్చరించారు. శ్రీవారి లడ్డూను అపవిత్రం చేశారని చెబితే హెరిటేజ్‌ను తెరపైకి తీసుకొచ్చారన్నారు. ‘నేను ప్రాణం పోయినా తప్పు చేయను’ అని స్పష్టం చేశారు. చేసిన తప్పును పక్క వాళ్లపై నెట్టే నీచులు కూడా ఉన్నారన్నారు. అలాంటి కరుడుగట్టిన నేరస్థుడితో రాజకీయం చేయాలా? అని విమర్శించారు. తాను కూడా ఎప్పుడు జైలుకు వెళ్తానని ఊహించలేదని.. జగన్ ప్రభుత్వ హయాంలో నాకు నోటీసు ఇస్తే సమాధానం చెప్పేవాడినని కానీ వారు అవకాశం ఇవ్వలేదని సీఎం చంద్రబాబు అన్నారు. అపట్లో చాలా మంది తాను జైల్లో నుంచి ప్రాణాలతో బయటకురారని అనుకున్నారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. కొందరు వైసీపీ నేతలు అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా బూతులు మట్లాడుతున్నారని.. రెచ్చగొట్టే పనులు చేస్తున్నారని సీఎం చంద్రబాబు విమర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *