సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం డిఎన్నార్, గన్నాబత్తుల క్రీడా మైదానంలో 4 రోజులు పాటు జరిగే చైతన్య భారతి 18వ జాతీయస్థాయి సాంఘిక నాటికల పోటీలను డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామ కృష్ణంరాజు, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, సినీనటులు రావు రమేష్ లు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. రఘురామ మాట్లాడుతూ కళలను ఆధారించాలంటే అప్పట్లో రాజులు ఉండేవారని, ఇప్పుడూ ప్రభుత్వాలు చేస్తున్నాయని, కానీప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని,నాటక రంగానికి ప్రభుత్వం సహకారం అందించాలని అన్నారు. నాటక రంగానికి ఆదరణ తగ్గుతుందని, నాటక రంగాన్ని బ్రతికించుకుందామని అన్నారు. సినిమా ప్రపంచంలో నాటక రంగాలు కొట్టుకుపోతున్నాయని, అయిన నాటక రంగాన్ని బ్రతికిస్తూ ఇటువంటి జాతీయస్థాయి నాటక పోటీలను నిర్వహించడం అభినందనీయమన్నారు. జిల్లా కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ.. డిటిటల్ కాలంలో కూడా నాటక రంగాన్ని రక్షించడం గొప్ప విశేషమని అన్నారు. చైతన్య భారతి నాటక పరిషత్ అధ్యక్షులు రాయప్రోలు మాట్లాడుతూ.. 4 రోజుల్లో 9 నాటికలను ప్రదరిస్తున్నామని అన్నారు. అనంతరం సినీ నటులు రావు రమేష్ కు ఆత్మీయ చైతన్య పురస్కారం, రంగస్థల నటులు రచయిత మిశ్రోకు చుక్కన సత్యనారాయణ రాజు రంగస్థల చైతన్య పురస్కారం, రంగస్థల నటీమణి మణిబాల కు పెనుబోతుల శేషగిరిరావు హార్దిక చైతన్య పురస్కారాలతో సత్కరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *