సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: అమెరికా ఎన్ని బెదిరింపులు, టాక్స్ లపెంపు, కక్ష సాధింపు సాధింపు చర్యలకు పాల్బడిన కూడా భారత్ తన సుదీర్ఘ మిత్రుడు రష్యా నుండి పెట్రోల్ కొనడం ఆపడంలేదు.. ఈ నేపథ్యంలో చైనాలోని టియాంజిన్‌లో జరిగిన షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సమావేశ సందర్భంలో ఆసక్తికర సన్నివేశాలు దర్శనమిచ్చాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కలుసుకోగానే హృదయపూర్వక ఆలింగనం చేసుకున్నారు. అనంతరం ప్రధాని మోదీ, వ్లాదిమిర్ పుతిన్ చైనాలోని టియాంజిన్‌లో చర్చలు జరిపారు. ప్రధాని మోదీ తన ఎక్స్ ఖాతా ద్వారా..ఆ ఫోటోలు షేర్ చేసారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను కలవడం ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటుందని వ్యాఖ్యానించారు.
