సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: చైనా లో HMPV వైరస్ శరవేగంగా విస్తరిస్తుంది. పైకి కరోనా అంత ప్రమాదకర వైరస్ కాదని చైనా ప్రకటిస్తునప్పటికీ కరోనా నాటి గత అనుభవాల దృష్ట్యా భారత్ తో సహా ప్రపంచ దేశాలు లో ప్రజలు కాస్త ముందు జాగ్రత్తలు పడితే మంచిది. ఇప్పటికే బీజింగ్‌, తియాంజిన్‌, షాంఘై, గువాంగ్‌జూ, హెబోయ్‌, జెజియాంగ్‌ రాష్ట్రాల్లో తీవ్రంగా కేసులు నమోదవుతున్నాయి. హాస్పటల్స్ రోగులతో నిండిపోతున్నాయి. చైనాలోని పలు రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ విధించారు. కరోనా వైరస్‌కు HMPV వైరస్‌కు దగ్గరి పోలికలున్నట్లు వైద్యులు ధ్రువీకరించారు. కూడా శ్వాసవ్యవస్థపైనే వైరస్‌ దాడి చేస్తోంది. ఈ వైరస్‌ కరోనా మాదిరిగానే తుమ్ములు, దగ్గుతో వ్యాప్తి చెందే అవకాశం‌ ఉందట. జ్వరం, దగ్గు, గొంతునొప్పి, శ్వాస సమస్య, ఆయాసం ఉంటే అనుమానపడాల్సిందేనని అంటున్నారు. పిల్లలు, వృద్ధులు, రోగనిరోధకశక్తి తక్కువగా ఉన్న వ్యక్తులకు ఈ వ్యాధి వేగంగా సోకే ప్రమాదం ఉంది. చేతులు శుభ్రంగా ఉంచుకోవడంతో పాటు, మాస్క్‌లు ధరించడం, భౌతికదూరం పాటించాలని సూచిస్తున్నారు. HMPV నివారణకు వ్యాక్సిన్‌ లేదు. వ్యాధి లక్షణాలను తగ్గించేందుకు, మరిన్ని సమస్యలు తలెత్తకుండా నివారణగా మాత్రమే ప్రస్తుతం వైద్య చికిత్సను అందిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *