సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల టర్కీ ,సిరియాలలో భారీ భూకంపం దాటికి సుమారు 60 వేల ప్రజలు మరణించిన విప్పుతూ ప్రపంచం మరువక ముందే చైనా లోని జింజియాంగ్ వీఘర్ అటానమస్ రీజియన్ లో నేడు, గురువారం తీవ్ర భూకంపంతో విలవిలలాడింది. చైనా స్టేట్ మీడియా కథనం ప్రకారం నేడు,గురువారం 7.3 తీవ్రతతో భూమి కంపించింది. అయితే అమెరికన్ జియొలాజికల్ సర్వే తెలిపిన వివరాల ప్రకారం భూకంప లేఖినిపై దీని తీవ్రత 6.8 అని తెలుస్తోంది. ఇది తజకిస్ఠాన్ సరిహద్దుల్లోని ముర్ఘబ్‌కు పశ్చిమ దిశలో 67 కిలోమీటర్ల దూరంలో సంభవించింది. భూమి లోపల 20 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉంది. పామిర్ కొండ ప్రాంతంలో సుమారు కొన్ని వందల మంది నివసించే ప్రాంతంలో ఈ భూకంపం సంభవించింది. ఇదిలావుండగా, ఈ భూకంపం వల్ల ప్రాణ నష్టం జరిగిందా? లేదా? అనే సమాచారం చైనా ఇంకా అధికారికంగా తెలుపవలసి ఉంది.
