సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఛత్తీస్‌గఢ్‌లో నేడు, శనివారం భారీ ఎన్కౌంటర్ జరిగింది. పోలీసులకు, నక్సలైట్లకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఏడుగురు నక్సలైట్లు ప్రాణాలు కోల్పోయారు. నారాయణ్ పుర్ – దంతేవాడ జిల్లాల సరిహద్దులోని గోబెల్ అటవీ ప్రాంతంలో ఈ దుర్ఘటనలు జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మావోయిస్టుల కదలికల సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP)తో కలిసి జాయింట్ ఆపరేషన్ చేపట్టారు.ఈ క్రమంలో ఎదురుపడ్డ నక్సలైట్లపై కాల్పులు జరిపారు. మృతులను నారాయణ్‌పుర్, దంతేవాడ, బస్తర్, కొండగావ్ జిల్లాలకు చెందిన వారిగా గుర్తుపట్టారు. ఇంకా పూర్తీ వివరాలు రావలసి ఉంది.
