సిగ్మాతెలుగు డాట్, న్యూస్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని దంతెవాడ జిల్లా అరణ్‌పూర్‌లో నక్సలైట్లు ఘాతుకానికి పాల్పడ్డారు. వారు రోడ్డు మార్గంలో పెట్టిన మందుపాతర పేల్చి 10 మంది జవాన్లు, ఒక డ్రైవర్ మరణించారు. మృతులంతా డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ జవాన్లు డీఆర్‌జీ జవాన్లు కూంబింగ్ ముగించుకుని మినీ బస్సులో వస్తుండగా నక్సలైట్లు మందుపాతర పేల్చారు. దీంతో మొత్తం 11 మంది చనిపోయారు. ఘటనా స్థలనికి పోలీస్ ఉన్నతాధికారులు చేరుకున్నారు. నక్సలైట్ల కోసం కూంబింగ్ మొదలు పెట్టి అడవి జల్లెడ పడుతున్నారు. ఈ తీవ్ర విషాదం ఫై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ భాఘేల్‌తో మాట్లాడారు. మృతి చెందిన జవానులు కుటుంబాలకు అన్నివిధాలా సాయమందిస్తామని భరోసా ఇచ్చారు.
