సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్:ఎన్నికల ముంగిట మోడీ సర్కార్ మరో అగ్ని పరీక్ష ను ఎదుర్కోవలసిన సమయం ఆసన్నమయింది.దేశవ్యాప్తంగా తమ రైతుల డిమాండ్లు నెరవేర్చాలని ఉత్తరాది రైతులు మరోసారి ఛలో ఢిల్లీ మార్చ్‌కు పిలుపునిచ్చారు. పంట ఉత్పత్తులకు కనీస మద్దతు ధర, రైతులు, రైతు కూలీలకు పెన్షన్, రైతు రుణమాఫీ, కరెంట్ బిల్లుల టారిఫ్ పెంపుదల నిలిపివేత తదితర డిమాండ్లతో రైతులు కేంద్ర ప్రభుత్వంపై కదం తొక్కారు కొద్దిరోజుల క్రితం చేపట్టిన ఢిల్లీ మార్చ్ ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. రైతులతో పోలీసుల మధ్య తోపులాటలో ఇరు వర్గాలు గాయపడిన సంగతి తెలిసిందే. దాంతో కొద్దిరోజులు ఆందోళనకు విరామం ఇచ్చారు. తిరిగి నేడు, బుధవారం ఢిల్లీ ముట్టడిస్తామని రైతు సంఘాలు స్పష్టం చేశాయి. నేటి మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు రైల్ రోకో చేపడతామని రైతు నేతలు ప్రకటించారు బస్సు, రైళ్ల ద్వారా ఢిల్లీకి రైతులు లక్షలాదిగా చేరుకొంటున్నారు. రైతు నేతల ఢిల్లీ ముట్టడి పిలుపు నేపథ్యంలో పోలీసులు అప్రమత్తం అయ్యారు. సరిహద్దుల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.
