సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: చాల ఏళ్ళ తరువాత బాలీవుడ్ సగౌరవంగా తలెత్తుకొనేలా చేసిన భారీ సినిమా విక్కీ కౌశల్ హీరోగా, రష్మిక మందాన జంటగా దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ నిర్మించిన’ ‘చావా’ ( పులి బిడ్డ) కేవలం హిందీలో మాత్రమే విడుదలయిన ఈ చారిత్రాత్మక ఛత్రపతి శివాజి తనయుడు శంభాజీ కధ తో నిర్మించిన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. కేవలం 7 రోజులలో 200 కోట్ల కలెక్షన్స్ దిశగా అడుగులు వేస్తుంది. చిన్నా, పెద్ద తేడా లేకుండా అన్ని వయసుల వారిని భావోద్వేగానికి గురి చేసిన చిత్రం ‘ఛావా’ (Chhaava Movie). శంభాజీ మహారాజ్ హిందూ మతం పౌరుషం కోసం ఢిల్లీ చక్రవర్తి ఔరంగజేబు అకృత్యాలను ఎదిరించి ఆత్మ బలిదానం చేసిన పోరాట యోధుడి కథను ప్రేక్షకుల హృదయాలను హత్తుకునేలా, రోమాలు నిక్కబొడుచుకొనేలాచూపించారు ఈ సినిమా దేశవ్యాప్తంగా అందరికీ మరింత చేరువ కావాలనే ఉద్దేశంతో బీజేపీ మరియు ఎన్డీయే కూటమి అధికారంలో ఉన్న పలు రాష్ట్రాల ప్రభుత్వాలు దీనికి పన్ను మినహాయింపునిచ్చాయి.. ఇప్పటికే మధ్య ప్రదేశ్ గోవాలలో పన్ను మినహాహింపగా, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఇటువంటి చరిత్ర వక్రీకరించకుండా తిసిన ‘ చావా’ ను చూసి గర్విస్తున్నామని, ఈ సినిమాకు పన్ను మినహాయింపు పరిశీలిస్తాననని అన్నారు. అదే జరిగితే ప్రేక్షకులకు టికెట్ ధర తగ్గటం తో పాటు నిర్మాతలకు షేర్ పెరిగే అవకాశం ఉంది. మరి తెలుగులో డబ్బింగ్ ఎప్పుడు చేస్తారో?
