సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి గూడెంలో ఇసుక తీసుకొనివెళుతున్న ట్రాక్టర్లు డ్రైవర్స్ శ్రీనివాస పురం బైపాస్ రోడ్డు మీద ట్రాక్టర్లు నిలిపివేసి ఆందోళనకు దిగారు. ఏపీలో కూటమి సర్కార్ లో ఒక ప్రక్క ఉచిత ఇసుక పధకం అంటూనే మరో ప్రక్క ఇసుక తీసుకొనివెళుతున్న తమపై ఎదో రూల్స్ చెప్పి అధికారులు అడ్డుకొంటున్నారని, తమపై పోలీసులు అన్యాయంగా కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. ట్రాఫిక్ ఆగిపోయి పోలీసులు అక్కడ ట్రాక్టర్లు అడ్డు తొలగించడానికి ప్రయత్నించడంతో ఓ ట్రాక్టర్ డ్రైవర్ తన ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశారు. దీనితో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఉచిత ఇసుక అంటూ కూటమి ప్రభుత్వం తమను మోసం చేసిందని తమ కుటుంబాలను ఎలా పోషించాలంటూ? డ్రైవర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిలదీస్తున్నారు. పోలీసులు రంగప్రవేశం చేసి డ్రైవర్లను బలవంతంగా అక్కడి నుంచి తరలిస్తున్నారు.
