సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా లోని జంగారెడ్డి గూడెంలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో 2022 మార్చి లో కల్తీ మద్యం కారణంగా నమోదైన మరణాలకు సంబందించిన కేసు ను రి ఓపెన్ చెయ్యాలని తాజగా నేడు సోమవారం ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. 2022 మార్చి లో అక్రమ మద్యం సేవించటంతో నమోదైన మరణాలపై లోతుగా దర్యాప్తు చేపట్టేందుకు ఏలూరు ఎస్పీ కెపీఎస్ కిషోర్ నేతృత్వంలో ముగ్గురు అధికారులతో టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసింది. దీనికి ఏలూరు ఎస్పీ కెపీఎస్ కిషోర్ నేతృత్వంలో స్పె షల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటైంది. లోతైన విచారణ చేసి మరణాలకు బాధ్యు లు ఎవరో గుర్తిం చాలని ఆదేశాలు జారీ చేశారు.
