సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం లో నేడు, ఆదివారం జరిగిన సిపిఐ పార్టీ ప.గో.జిల్లా నేతల సమావేశంలో కార్యదర్శి కోనాల భీమారావు మాట్లాడుతూ.. జగనన్న గృహ నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని, టిడ్కో గృహాలు లబ్ధిదారులకు అందజేయాలని కోరుతూ సీపీఐ ఆధ్వర్యంలో మార్చి 2 న విజయవాడలో జరుగనున్న మహాధర్నా విజయవంతం చేయాలనిపిలుపునిచ్చారు. ఆదివారం భీమవరం ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ కార్యాలయం నందు మహాధర్నా వాల్ పోస్టర్ ఆవిష్కరించారు. ఈసందర్భంగా భీమారావు మాట్లాడుతూ జగనన్న గృహ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న 1.80 లక్ష రూపాయలు పెరిగిన గృహ నిర్మాణ సామాగ్రి ధరలతో ఎంతమాత్రం సరిపోక లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఇసుక, సిమెంటు, ఇనుము ఉచితంగా లబ్ధిదారులకు అందజేయాలని, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇళ్ళ స్థలాలకు ఇవ్వాలని డిమాండ్ చేసారు. ఈ మహాధర్నాలో జగనన్న, టిడ్కో గృహాల లబ్ధిదారులు పెద్ద ఎత్తున పాల్గొంటారన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ భీమవరం పట్టణ కార్యదర్శి చెల్లబోయిన రంగారావు, రూరల్ మండల కార్యదర్శి ఎం.సీతారాం ప్రసాద్, పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యురాలు సికిలే పుష్పకుమారి, జిల్లా సమితి సభ్యులు వైవి ఆనంద్,మల్లుల శ్రీనివాస్, ఆకల రాము పాల్గొన్నారు.
