సిగ్మాతెలుగు డాట్, న్యూస్: సీఎం జగన్ నేడు, బుధవారం అనంతపురం జిల్లా లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా నార్పలలో జగనన్న వసతి దీవెన పథకం నిధులు విడుదల చేశారు. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 9,55,662 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుతుంది. విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.912 కోట్లు జమ చేశారు. జగనన్న వసతి దీవెన కింద ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ విద్యార్థులకు రూ.20 వేలు చొప్పున సాయం వాళ్ళ తల్లుల ఖాతాలలో బటన్ నొక్కి జామా చేసారు, ఈ సందర్బంగా సీఎం జగన్ మాట్లాడుతూ చదువు కోసం ఎవరూ అప్పులపాలు కాకూడదనేదే తమ ఉద్దేశమన్నారు. ఉన్నత చదువులు చదివే విద్యార్థులకు ఆర్థికసాయం అందిస్తున్నామన్నారు. కార్పొరేట్ విద్య సంస్థలకు పోటీగా నాడు-నేడుతో ప్రభుత్వ స్కూళ్ల రూపు రేఖలు మార్చేశామని అన్నారు,
