సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా నేడు, సోమవారం భీమవరం మండలంలోని తోకతిప్ప గ్రామంలో ఇంటింటికి తిరిగి గత మూడు సంవత్సరాలుగా ప్రతి కుటుంబానికి ప్రభుత్వం ద్వారా అందిన లబ్ధిని వివరించారు.గ్రామంలో ప్రభుత్వ పాఠశాలకు నూతనంగా రూ 7 లక్షల 65 వేల నిధులతో నిర్మించిన ప్రహరీ గోడను ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ప్రారంభించారు. ( ఫై చిత్రంలో ) అనంతరం .ఆయన మీడియాతో మాట్లాడుతూ..ప్రతి కుటుంబం ఆర్థికంగా బలోపేతం కావాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నవరత్న పథకాలను అమలు చేస్తున్నారని అన్నారు. కుల,మత రాజకీయాలతో సంబంధం లేకుండా ప్రజలందరికి సంక్షేమ పథకాలను అమలు చేస్తూనే మరోపక్క పెద్ద ఎత్తున రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేస్తున్నారని అన్నారు . అయితే ఆయన ఇంతటి ప్రజా అభిమానం పొందటం చంద్రబాబు ఇతర కొందరు ప్రతిపక్ష నేతలు ఓర్వలేకపోతున్నారని అన్నారు. రాష్ట్రంలో ఎదో అలజడి సృష్టించి ప్రజలలో తప్పుడు సంకేతాలు ఇవ్వడానికి వారి క్యాడర్ ను రెచ్చగొడుతున్నారు అని విమర్శించారు. ఐతే నాకు తెల్సి 2009 నుండి ఇప్పటి దాకా Y.S.జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఏరోజు కార్యకర్తలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు కానీ ఒక యుద్ధ వాతావరణం సంభవించే మాటలు కానీ ఇవాళ్టికీ చేయలేదు. కార్యకర్తల భవిషత్తు ను పాడుచెయ్యలేదు. నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు ఇలాంటివే.రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి సీఎం జగన్ అండగా ఉన్నారని ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *