సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: చిరు వ్యాపారులకు తమ జగన్ ప్రభుత్వం అండగా ఉందని భీమవరం ఎమ్మెల్యే ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ అన్నారు. నేడు, మంగళవారం స్థానిక క్యాంపు కార్యాలయంలో డిఆర్డిఏ పిడి ఎమ్ ఎస్ ఎన్ వేణుగోపాల్ తో మాట్లాడారు. అనంతరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ మాట్లాడుతూ.. జగన్ అన్న తోడు కార్యక్రమంలో భాగంగా రేపు,బుధవారం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిరు వ్యాపారుల ఖాతాల్లో వడ్డీ డబ్బులను జమ చేయనున్నారని పేర్కొన్నారు. భీమవరం నియోజవర్గంలో 5 వేల మంది చిరు వ్యాపారులకు బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించగా, వారు బ్యాంకులకు చెల్లించిన వడ్డీని నేడు తమ ప్రభుత్వం చిరు వ్యాపారుల బ్యాంకు ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతుందని అన్నారు. ఈ జగనన్న తోడు పథకం వల్ల చిరు వ్యాపారులకు వడ్డీల భారం లేకుండా పోతుందని , దీనివల్ల వారి కుటుంబాలకు మేలు కలుగుతుందని అన్నారు. భీమవరం నియోజకవర్గంలో రూ 12 లక్షల మేరకు లబ్ధి జరుగుతుందని అన్నారు.ఈ సమావేశంలో ఎంపీపీ పేరిచర్ల విజయ నరసింహారాజు, రాష్ట్ర గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ కామన నాగేశ్వరరావు, రాష్ట్ర రజక కార్పొరేషన్ డైరెక్టర్ రేవూరి గోగురాజు, తదితరులు పాల్గొన్నారు.
