సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ.. అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలపై ఒక ప్రక్క మెగాస్టార్ చిరంజీవి చాల ఘాటుగా స్వాందిస్తే .. జగన్ ను సైకో గాడు అన్నందుకు వైసీపీ నేతలు భగ్గుమంటున్నారు. బాలకృష్ణ కు — సర్టిఫికెట్ ఉందని సోషల్ మీడియాలో రచ్చరచ్చ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో లోనే మాజీ మంత్రి పేర్ని నాని.. తనదయిన పంచ్ లతో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎక్కడ ఏమి మాట్లాడాలో బాలకృష్ణ కు తెలియదని అతను తెలివి తక్కువ వాడు కాబట్టే తాను కూర్చోవాల్సిన సీటులో ( సీఎంగా) చంద్రబాబు కూర్చున్నారని అందరికి తెలుస్తునని స్వర్గీయ ఎన్టీఆర్ దంపతుల వంటి సంస్కార వంతుల కుమారుడుగా సంస్కార హీనుడు … విమర్శించారు. నిజానికి చిరంజీవి కన్నా ముందు వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా, తాను మంత్రిగా ఉన్న సమయంలో బాలకృష్ణ తనకు ఫోన్ చేశారంటూ పేర్ని నాని కీలక వ్యాఖ్యలు చేశారు. నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల ప్రమాణం చేసి చెప్తున్నా.. బాలకృష్ణ నాతో ఫోన్‌లో మాట్లాడాడు. మీరు మీ అమ్మానాన్నఎం ఎన్టీఆర్, బసవతారకం మీద ప్రమాణం చేసి కాదని చెప్పండి. అఖండ సినిమా కోసం జగన్ మోహన్ రెడ్డి గారితో అపాయింట్‌మెంట్ ఇప్పించమని నన్ను ఫోన్‌లో అడిగావ్. జగన్ గారితోనూ అదే చెప్పాను . బాలకృష్ణ వస్తాడంట సర్, మాట్లాడతాడంట, అపాయింట్‌మెంట్ ఇవ్వండి అని అడిగా.అఖండ సినిమా కోసమని. సినిమాకు ఎక్కువ ఖర్చు అయ్యిందంట, ఎక్కువ షోలు వేసుకుంటారంట అని చెప్పా. సరే బాలకృష్ణ కోసం మీరే ఏదో ఒకటి చేయండి అని జగన్ గారు అన్నారు. ఆరోగ్యశ్రీ క్రింద హైదరాబాద్ లోని మీ బసవతారకం కాన్సర్ హాస్పటల్ కు రోగుల వైద్యం కోసం బకాయిలు లేకుండా నిధులు చెల్లించాం. అంత హుందాగా ప్రవర్తించిన వైఎస్ జగన్ గురించి మాట్లాడే భాష అది..” అంటూ పేర్ని నాని విమర్శలు గుప్పించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *