సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు నేడు, సోమవారం మీడియాతో మాట్లాడుతూ… తనను గతంలో కస్టోడియల్ టార్చర్‌లో పీవీ సునీల్ కుమార్ కు కచ్చితంగా శిక్ష పడుతుందని, అతను సనాతన హిందూ ధర్మాన్నీ కించపరుస్తూ వ్యాఖ్యలు చేసాడని అన్నారు. తనను రౌడీ పెలో’ సినిమా లో సన్నివేశం తరహాలో కస్టడీ లో దారుణంగా కొట్టారని, ఎదో దైవికముగా బ్రతికి బయటపడి ఇప్పుడు మీ ముందు మాట్లాడుతున్నానని, ఇప్పుడు నడుస్తున్న ప్రజా ప్రభుత్వంలో తనకు న్యాయం జరుగుతుందని కస్టడీ టార్చర్ బాదితుడిగా విశ్వాసం వ్యక్తం చేస్తున్నాను అన్నారు., ఇదిలా ఉండగా అసెంబ్లీ కి రాకుండా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రవర్తిస్తున్న తీరు బాగోలేదని, ఆయన అసెంబ్లీకి వచ్చి తన అభిప్రాయాలు చెప్పాలని రఘురామ అన్నారు. 11 సీట్లకు పరిమితమైన పార్టీ అధినేతగా ఆయనకు ప్రతిపక్ష హోదా ఇచ్చేందుకు స్పీకర్, సీఎం అంగీకరిస్తారా ? సభకు వచ్చి ప్రజా సమస్యలపై మాట్లాడితే ప్రజలు ఆ హోదా ఇస్తారు. నిజానికి శాసన సభ్యుడు ఎవరైనా 60 రోజుల పాటు సరైన కారణం చెప్పకుండా అసెంబ్లీకి రాకపోతే అనార్హత వర్తిస్తుందని, జగన్ కూడా అసెంబ్లీ రాకపోవడానికి సమాధానం చెప్పాలని లేకపోతె పులివెందులకు ఉపఎన్నికలు వస్తాయని రఘురామ కృష్ణంరాజు అన్నారు.
