సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం నియోజకవర్గంలో కూటమి పార్టీల మద్దతుతో జనసేన పార్టీ అభ్యర్థిగా బరిలో నిలచిన మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు తన ఎన్నికల ప్రచారంలో ‘గేర్’ మార్చారు. ఇప్పటివరకు నియోజకవర్గంలో ప్యూహాత్మకంగా కీలకప్రాంతాలలో గుత్తం గా ఓట్లు ను అభ్యర్థిస్తూ.. టీడీపీ బీజేపీ జనసేన పార్టీల పెద్దలతో పాటు పలు కాలనీల పెద్దలు , కమ్యూనిటీల పెద్దలు, అపార్ట్మెంట్స్, నిర్వాహకులు ను కలుస్తూ, వారి సమస్యలు పరిష్కరిస్తానని హామీలు ఇస్తూ ..చాపక్రింద నీరులా తనదయిన వరవడిలో ప్యూహాత్మకంగా ఓట్లను అభ్యర్థిస్తున్న ఆయన, ఇటీవల నామినేషన్ పర్వము పూర్తీ అయ్యాక, పట్టణంలో వార్డుల వారీగా ప్రజలలోకి వెళుతున్నారు. బీజేపీ ఎంపీ అభ్యర్థి శ్రీనివాస వర్మ తో కూడా కలసి గ్రామాలలో పలువురితో కొత్త పరిచయాలు, సమావేశాలు , ఓట్ల అభ్యర్ధనకు సమయం కేటాయిస్తున్నారు. అలాగే వీరవాసరం మండలం ఫై బాగా పట్టుగా ప్యూహం బిగిస్తున్నారు. గతానికి బిన్నంగా యువత లక్ష్యంగా పూర్తీ దూకుడుగా ఆయన మాట తీరు మారిపోయింది. భీమవరం వన్ టౌన్ లో గత సాయంత్రం నుండి జబర్దస్త్ ఫ్రేమ్ రాంప్రసాద్ , జనసేన జిల్లా అడ్జక్షులు కోటికలపూడి గోవిందరావు, వీర మహిళలాలతో కలిపి సుంకరపడ్డయ్య వీధి , రెస్ట్ హౌస్ రోడ్డు, ఆదివారం బజారు సెంటర్, ఎడ్వార్డ్ ట్యాంక్ సెంటర్ వరకు ప్రచారం నిర్వహించారు. నేటి ఆదివారం ఉదయం, పట్టణం 29,30,31 వార్డులలో పులపర్తి రామాంజనేయులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భముగా అంజిబాబు మీడియాతో మాట్లాడుతూ.. తనకు ఎక్కడకు వెళ్లిన జనం ఘనంగా స్వగతం పలుకుతున్నారని, వారి ఆనందంలోనే నా గెలుపు కనపడుతుందని, ఇక సీఎం జగన్ మ్యానిపెస్టో లోకూడా కొత్త పధకాలు ఏమి లేవని , ఇక ఆయన చేసేది ఏమి లేదని జనం తెలుసుకొన్నారని ఇక సీఎం జగన్ ఇంటికి వెళ్లిపోవడం ఖాయం అని, ఎన్డీయే అధికారంలోకి రాగానే రాష్ట్రంలో, భీమవరంలో పాలన అభివృద్ధి పధంలో నడుస్తుందని అంజిబాబు మీడియాతో అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *