సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కేంద్రంలోని కాంగ్రెస్ అధిష్టానాన్ని నిర్ణయాన్ని ఎదిరించి స్వర్గీయ వై యస్ రాజశేఖర్ రెడ్డి మరణం తట్టుకోలేక మరణించిన వందలాది బాధితుల కుటుంబాలను వై ఎస్ జగన్ ఓదార్పు యాత్ర పేరుతొ వాళ్ళ ఇంటికి వెళ్లి పరామర్శించడం దేశ రాజకీయాల్లో అదో చరిత్ర.. అప్పటి కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీని సమూలంగా అటు కేంద్రంలోను ఇటు తెలుగు రాష్ట్రాలలో అధికారానికి దూరం చేసిన చరిత్ర కు తొలిబీజం ఓదార్పు యాత్రే.. ఆ ఓదార్పు యాత్రే వైసిపి సంచలన ప్రాంతీయపార్టీ అంకుర్పాణ కు బాటలు వేసింది. ..దేశ చరిత్రలో ఒక్క అవినీతి కేసు నిరూపితం కాకున్నా రిమాండ్ లో జగన్ 16నెలలు జైలు జీవితం గడపటం.. తదుపరి జగన్ పాదయాత్ర కు బాటలు వేసిన ఘట్టం.. నిజానికి అదే స్పూర్తితో టీడీపీ కూడా సిద్ధం అవుతుంది.. నిజం గెలవాలి.. యాత్ర పేరుతొ చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో బాధతో మరణించారని టీడీపీ భావిస్తున్న పార్టీ అభిమానుల కుటుంబాలకు చంద్రబాబు భార్య భువనేశ్వరి స్వయంగా ఇంటింటికి వెళ్లి పరామర్శించ నున్నారు. దీనిలో భాగంగా నేడు, మంగళవారం ఉదయం తిరుమల శ్రీవారిని భువనేశ్వరి దర్శించుకున్నారు. అనంతరం అక్కడ్నుంచి నేరుగా కుప్పంలోని నారావారి పల్లెకు చేరుకొని.. అక్కడ గ్రామ దేవతలైన దొడ్డి గంగమ్మ, నాగాలమ్మకు ప్రత్యేక పూజలు చేసారు. రేపటి నుంచి భువనేశ్వరి పరామర్శ మొదలుపెట్టనున్నారు. రేపు బుధవారం బాధిత కుటుంబాల పరామర్శలతో పాటు .. ఐతేపల్లి మండలంలోని ఎస్సీ కాలనీలో పల్లె ప్రజలతో కలిసి భువనేశ్వరి సహపంక్తి భోజనం చేయబోతున్నారు. అనంతరం అగరాల బహిరంగసభలో చంద్రబాబు అరెస్టుపై మాట్లాడతారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *