సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీ సచివాలయంలో నేడు, సోమవారం సాగునీటి ప్రాజెక్ట్‌లపై సీఎం చంద్రబాబు పవర్ ప్రజెంటెషన్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ కు ప్రజలలో అసలు క్రెడిబులిటీ లేదని సీఎం నారా చంద్రబాబు విమర్శించారు. జగన్ వల్ల మీడియా, ఫైనాన్స్, వ్యవస్థలు, వ్యక్తులు ఎన్నో ఇబ్బందులు పడ్డారని అన్నారు. ఐదేళ్లలో ఏం జరిగింది…ఇప్పుడు ఏం జరిగింది అని ప్రజలు చూస్తున్నారన్నారు. జగన్ ఎప్పుడు ఏం చేస్తారనేది అతనికే తెలియదని ఎద్దేవా చేశారు. క్రెడిబిలిటీ లేని నాయకులు, హిడెన్ ఏజెండాతో వాస్తవాలు లేకుండా జగన్ లా మాట్లాడతారని మండిపడ్డారు. ఇన్నాళ్లు అబద్ధాలతో జగన్ రాజకీయం చేశారని.. తన హయాంలో ఇప్పుడు అలాకాదని అన్నారు. తన హయాంలో వాటర్ సెక్యూరిటీకి ఎంతో ప్రాధాన్యం ఇచ్చామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఇటీవల ‘‘తెలుగు తల్లికి జలహారతి ప్రాజెక్టు రూపకల్పన చేశాం. విజన్ 2047 డాక్యుమెంట్‌లో బాగంగా వాటర్ ప్రాజెక్టు ప్రొవిజన్ ఉంచాం. ఇది దాదాపు ప్రస్తుతానికి రూ.80.112 కోట్లు వ్యయం అవుతుంది. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే రాష్ట్రానికి గేమ్ చేంజర్ లాంటిది. అన్నారు.
