సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌కు (Jagan) NCLTలో నేడు, మంగళవారం భారీ ఊరట లభించింది. సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ వాటాల బదిలీపై జగన్‌ వేసిన పిటిషన్‌ను అనుమతించింది. అంతే కాదు తల్లి విజయలక్ష్మి, చెల్లెలు షర్మిలకు తాను గతంలో తమ మధ్య మంచి అనుబంధం ఉన్నపుడు రాసి ఇచ్చిన గిఫ్ట్ వాటాలు బదిలీ నిలుపుదల చేయాలని, వాటిని వారు అమ్మకానికి పెట్టడం చెల్లదని జగన్ వేసిన పిటిషన్‌ పై విచారణ జరిపిన ధర్మాసనం.. జగన్ వాదనలతో ఏకీభవించింది. దానితో సంచలన రీతిలో విజయలక్ష్మి, షర్మిలకు (YS Sharmila) జగన్ గిఫ్ట్ గా ఇస్తానని డీల్ రాసుకున్న వాటాలు వారి స్వంతం కాలేదని వాటిపై హక్కులను నిలుపుదల చేస్తూ తీర్పు వెలువరించింది. కాగా గతంలో తన అన్న జగన్ వదిన భారతి కలిసి తమకు సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్‌లో రావాల్సిన వాటాలను ఇవ్వడం లేదని షర్మిల, విజయలక్ష్మి NCLT లో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై జగన్ గతంలో మాట్లాడుతూ.. ఇది తనఫై ఒక కుట్ర పూరితంగా జరుగుతుందని .తనపై గతంలో కోర్ట్ లో ఉన్న కేసుల పరిష్కారం అయ్యేవరకు తన ఆస్తులను అన్యాక్రాంతం చెయ్యనని, యధా తధా స్థితి కొనసాగిస్తానని హామీ ఇస్తేనే తనకు కోర్ట్ బెయిల్ ఇచ్చారని మరిప్పుడు తన స్వంత తల్లి , చెల్లి వాటిలో భాగాలు అమ్మివేస్తే కోర్ట్ తన బెయిల్ రద్దు చేసి జైలు కు పంపాలని దురాలోచన దాగి ఉందని మీడియా కు వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *