సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మాజీ సీఎం జగన్, ఆయన సోదరి, కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల మధ్య సరస్వతీ పవర్ సహా ఆస్తుల వ్యవహారంలో రగడ జరుగుతున్న సంగతి తెలిసిందే. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశాల మేరకు పల్నాడు జిల్లా పరిధిలో మాజీ సీఎం జగన్ కుటుంబానికి చెందిన సరస్వతీ పవర్ సంస్థ భూములను అటవీ, రెవెన్యూ శాఖల అధికారులు పరిశీలించారు. పవన్ కళ్యాణ్…వారికీ కేటాయించిన భూములలో అటవీ శాఖ భూములు ఉన్నాయా? ఉంటే ఎంత విస్తీర్ణంలో ఉన్నాయో నివేదిక ఇవ్వాలని సూచించారు.దానితో ఆగమేఘాలమీద అధికారులు దాచేపల్లి, మాచవరం మండలాల్లో పర్యటించారు. . దాచేపల్లి డిప్యూటీ రేంజ్ అధికారి (డీఆర్వో) విజయలక్ష్మి, బీట్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు హద్దురాళ్లను గుర్తించి రికార్డులను పరిశీలించారు. తంగెడ, వేమవరం, చెన్నాయపాలెం గ్రామాల్లో 2010లో సరస్వతీ పవర్ సంస్థ సుమారు 1600 ఎకరాలు సేకరించింది. కానీ ఇప్పటికి ప్రాజెక్టు పూర్తీ కాలేదు.. తంగెడ, చెన్నాయపాలెం గ్రామాల మధ్య సుమారు 6 కి.మీ.లో అధికారులు హద్దురాళ్లను గుర్తించారు. సరస్వతీ పవర్ సంస్థ కొనుగోలు చేసిన భూముల్లో అటవీ భూములకు సంబంధించి ఆధారాలు లభించలేదని డీఆర్వో విజయలక్ష్మి తెలిపారు. అటవీ శాఖాధికారులు మరో రెండు రోజులు సర్వే కొనసాగించనున్నారు.
