సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తాడేపల్లి లోని మాజీ సీఎం జగన్ నివాసం లో నేడు, శుక్రవారం ముద్రగడ పద్మనాభం ఆధ్వర్యంలో గోదావరి జిల్లాలకు చెందిన వైసీపీ పార్టీకి చెందిన కాపు నేతలు వైసీపీ అధినేత జగన్ తో సమావేశం అయ్యారు. ఏదిఏమైనా పార్టీ దారుణ ఓటమి తరువాత పరిస్థితులను దైర్యంగా ఎదుర్కొన్న ముద్రగడ పద్మనాభాన్ని జగన్ ప్రత్యేకంగా అభినందించారు. పశ్చిమ గోదావరి జిల్లా కీలక కాపునేత, భీమవరం కు చెందిన చినమిల్లి వెంకటరాయుడు కూడా జగన్ కు తాజా పరిస్థితులను వివరించారు. మిగతా కాపు నేతలు వారి వారి నియోజకవర్గాలలో ఓటమికి కారణాలు , పార్టీ భవిషత్తు ప్రణాళికలు ఫై జగన్ తో సుదీర్ఘంగా చర్చించారు. మరో 6 నెలలలోనే వైసీపీ కి దూరం అయిన కేవలం 10 శాతం ప్రజలకు కూడా కూటమి ప్రభుత్వ అమలుకాని హామీలపై ఒక అవగాహన వస్తుందని వాస్తవాలు వారే తెలుసుకొంటారని, త్వరలో గోదావరి జిల్లాలలో తాను స్వయంగా పర్యటిస్తానని జగన్ వారికీ హామీ ఇచ్చారు.
