సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం నేపథ్యంలో నేడు, బుధవారం ఉదయం 10:00 గంటలకు వైసీపీ అధినేత జగన్ తో సహా వైసీపీ ఎమ్మెల్యే లు సభలోకి వచ్చారు. అయితే సభ ఆరంభమైన కాసేపటికే అంటే కేవలం 15 నిమిషాలోపే వైసీపీ 11మంది సభ్యులు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. సభలో తమకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని, ప్రజా సమస్యలను ప్రస్తావించడానికి అనుమతి ఇవ్వలేదని వైసీపీ సభ్యులు పేర్కొన్నారని సమాచారం. దీంతో వారు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వాకౌట్ చేశారు. ఈ సమయంలోజై జగన్ అనే నినాదాలని వైసీపీ సభ్యులు చేయగా.. నినాదాలు చేయొద్దని జగన్ వారించారు. అయితే జగన్ చెప్పిన కూడా వైసీపీ ఎమ్మెల్యేలు మరింత బిగ్గరగా జై జగన్ అంటూ నినాదాలు చెయ్యడం గమనార్హం.గవర్నర్ ఉభయ సభల ప్రసంగం నేపథ్యంలో జగన్ అసెంబ్లీ లాబీలో 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలతో పాటు 36 మంది వైసీపీ ఎమ్మెల్సీ లతో పిచ్చాపాటి మాట్లాడారు.
