సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు నేడు, శుక్రవారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు గుంటూరు జిల్లా, నగరపాలెం పోలీసులు కేసులు నమోదు చేశారు. గత వైసీపీ ప్రభుత్వం లో సునీల్ సీఐడీ డీజీగా పని చేశారు. ఆయనపై కీలక నిందితుడుగా కేసు నమోదు అయ్యింది. అప్పుడు వైసీపీ లో రెబల్.. నరసాపురం ఎంపీగా ఉన్న రఘురామ కృష్ణంరాజు హైదరాబాద్ నుండి తరలించి తమ కస్టడీకి తీసుకున్న సమయంలో కొట్టడమే కాకుండా హత్యాయత్నం చేశారని, చిత్ర హింసలు పెట్టారని, జగన్ మోహన్ రెడ్డిని విమర్శిస్తే తనను చంపేస్తానని సునీల్ కుమార్ తనను బెదిరించారని ఫిర్యాదు చేశారు. దీంతో మాజీ సీఐడీ సునీల్‌తోపాటు తనపై పోలీస్ కస్టడీలో జరిగిన హత్యాయత్నానికి బాధ్యులుగా సీఐడీ మాజీ చీఫ్ సునీల్ కుమార్, ఇంటిలిజెన్స్ చీఫ్ సీతారామంజనేయులు, అప్పటి సీఐడీ, అడిషనల్ ఎస్పీ విజయ్ పాల్‌లపై, అధికారులను ప్రేరేపించారన్న ఆరోపణపై మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేసు నమోదైంది. తనకు అయిన గాయాలపై కోర్టులో గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి తప్పుడు నివేదిక ఇచ్చారని ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు గుంటూ జిల్లా పోలీసులు కేసు నమోదు చేశారు.
