సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీలో నామినేషన్స్ వేసిన వివిధ పార్టీల అధినేతల వారి నామినేషన్స్ అఫిడవిట్ లలో పేరుకున్న ఆస్తుల వివారాలు ఇలా ఉన్నాయి.వైసీపీ పార్టీ అధినేత, ఏపీ సీఎం జగన్‌ పేరిట రూ. 529 కోట్ల 87 లక్షల విలువైన స్థిర, చరాస్తులు ఉన్నాయి. ఆయన భార్య భారతిరెడ్డి, కుమార్తెలు హర్షిణిరెడ్డి, వర్షారెడ్డిల పేరిట 757 కోట్ల 65 లక్షలున్నాయి. 2019లో జగన్‌ ఒక్కరి ఆస్తుల విలువ 375కోట్ల 20 లక్షలుండగా.. అయిదేళ్లలో 41.22 శాతం పెరిగింది. జగన్‌ పేరిట ఏడు కంపెనీల్లో 263 కోట్ల 64 లక్షల విలువైన ఈక్విటీ షేర్లు ఉన్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు పేరు మీద మొత్తం రూ.36.36 కోట్లు ఆస్తులున్నాయి. వీటిలో చరాస్తులు రూ.4.80 లక్షలు, వీటిలో ఏపీ9జీ393 నంబరు అంబాసిడర్‌ కారు విలువ రూ.2,22,500. బంగారం లేదు. స్థిరాస్తులు రూ.36.31 కోట్లున్నాయి. కుమారుడు లోకేశ్‌తో కలిసి బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా నుంచి రూ.3.48 కోట్లు ఇంటి రుణం తీసుకున్నారు. బంగారం, ఇతర ఆభరణాలు కలిపి రూ.1.40 కోట్లు. అప్పులు రూ.6.83 కోట్లు. ఉన్నాయి. ఇక జనసేన అధినేత పవన్ కల్యాణ్..ఆస్తుల విలువ.. బ్యాంకు నిల్వలు, బాండ్లు, వాహనాలు, బంగారం వంటివి కలిపి రూ. 41 కోట్ల 65 లక్షలు. రూ. 2 కోట్ల విలువ చేసే 1,680 గ్రాముల బంగారం, డైమండ్లు ఉన్నాయి. భార్య కొణిదెల అన్నా పేరిట 215 గ్రాముల బంగారం సహా మొత్తం రూ. కోటి 22 వేల విలువైన ఆస్తులున్నాయి. తన నలుగురు పిల్లల్లో అకీరా నందన్ మేజర్ కాగా, మరో ముగ్గురు మైనర్ల పేరిట కూడా ఆస్తులున్నాయి. మైనర్లు అయిన కొణిదెల పోలిన, మార్క్ శంకర్ల పేరిట ఒక్కొక్కరికీ రూ.11 కోట్ల ఖరీదైన భూములున్నట్టు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *