సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్ : టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చాన్నాయుడు నేడు, బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి పట్టిన ఒక సైకో అని ఏపీకి ముఖ్యమంత్రి కావడం మన దురదృష్టమని అన్నారు. జగన్ పార్టీ అధికారంలో ఉండేది ఇక 8 మాసాలేనని అన్నారు. 2014 ఎన్నికల్లో జగన్ ప్రజలకు ఆశలు కల్పించి మోసం చేశారని విమర్శించారు. ఏపీలో టీడీపీ లేకుండా చేయాలని ఆయన చేయని ప్రయత్నం అంటూ లేదని.. కానీ ధైర్యంగా నిలబడ్డామని, దేనికీ లొంగలేదని అన్నారు. వైసీపీలా టీడీపీ గాలికి పుట్టిన పార్టీకాదని.. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా 160 స్ధానాలు గెలుచుకోవడం ఖాయమని అచ్చెన్నాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు. ఏపీని గాడిలో పెట్టగలిగే బాధ్యత టీడీపీ తీసుకుంటుందన్నారు. ‘బటన్ నొక్కడానికే ఉన్నాను… మీరు కష్టపడండి’ అని సిగ్గులేకుండా జగన్ చెబుతున్నారని మండిపడ్డారు. సంపదను సృష్టించి పేదలకు పంచాలని.. కేవలం బటన్ నొక్కడం గొప్పతనం కాదన్నారు.
.
